Mamata Banerjee : బీజేపీ ఎంపీని కలిసిన సీఎం మమత.. పశ్చిమ బెంగాల్ లో సంచలనం

Update: 2024-06-19 05:29 GMT

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మంగళవారం ట్విస్ట్ నెల కొంది. ప్రధాన ప్రతిపక్షమైన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ నివాసానికి రాష్ట్ర అధి కార తృణ మూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ( Mamata Banerjee ) చేరుకున్నారు.

బీజేపీ రాజ్యసభ ఎంపీ అనంత్ రాయ్ మహ రాజ్ సీఎం మమతకు ఘనస్వాగతం పలికారు. మమతా బెనర్జీ, బీజేపీ ఎంపీల భేటీకి సంబంధించిన వార్త పెద్దగా బయటకు రాలేదు. అనంత్ రాయ్ మహారాజ్ ఉత్తర బెంగాల్ రాజకీయాలలో పెద్ద పాత్ర పోషిస్తున్నారు. ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా బీజేపీ వేగం పెంచేందుకు ఆయన కృషి చేశారు. అనంత్ గ్రేటర్ కూచ్ బెహార్ పీపుల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఉత్తర బెంగాల్లో కూచ్ బెహార్ ను ప్రత్యేక గ్రేటర్ కూచ్ బెహార్ రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. తనను తాను గ్రేటర్ కూచ్ బెహార్ మహారాజాగా పిలుచుకునే అనంత్ ను ఏడాది క్రితమే పశ్చిమ బెంగాల్ నుంచి

బీజేపీ రాజ్యసభకు పంపింది. పశ్చిమ బెంగాల్ నుంచి బీజేపీ టికెట్ పై రాజ్య సభకు చేరిన తొలి నాయకుడు అనంత్ కావడం విశేషం. ఇప్పుడు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆయన నివాసానికి చేరుకుని ఆయనను కలిసిన

తర్వాత ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. గతేడాది హోంమంత్రి అమిత్ షా అనంత్ నివాసానికి చేరుకుని ఆయనను కలిశారు.

ఆ తర్వాతే బీజేపీ ఆయనను రాజ్యసభకు పం పిందని వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆయనను కలిసేందుకు సీఎం మమత ఆయన నివాసానికి చేరుకోవడంతో ఇక ఏం జరగనుందన్న ప్రశ్న ఉత్పన్న మైంది. నరేంద్ర మోడీ నేతృత్వంలోని గత ప్రభుత్వం లో సహాయ మంత్రిగా పనిచేసిన నిషిత్ ప్రమాణిక్ కూడా అనంత్కు సన్నిహితుడిగా చెబుతుంటారు. నిషిత్ ప్రమాణిక్ కూడా అనంత్ వలె అదే రాజ్బన్షి సంఘం నుంచి వచ్చారు.

పశ్చిమ బెంగాల్ లోని మొత్తం షెడ్యూల్డ్ కులాల జనాభాలో రాజ్బాని కమ్యూనిటీ 18 శాతానికి పైగా ఉన్నారు. రాజ్బన్షి కమ్యూనిటీ అనేది షెడ్యూల్డ్ కులాల వర్గంలో అతిపెద్ద, ప్రభావవంతమైన సం ఘం. రాజకీయ దృక్కోణంలో, ఉత్తర బెంగాల్లో ని ఐదు జిల్లాల్లోని 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజ్ బన్షి కమ్యూనిటీ ఓటర్లు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మంచి పనితీరు కనబరిచిన ఈ ఐదు జిల్లాల్లో కూచ్ బెహార్తో పాటు, అలీపురూర్ కూడా చేర్చబడింది. అయితే 2024 ఎన్నికల్లో కూచ్ బెహార్ లోక్సభ స్థానాన్ని ఆ పార్టీ కోల్పోయింది. ప్రస్తుతం ఈ భేటీపై రాష్ట్రంలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది.

Tags:    

Similar News