ఇప్పుడు అమెరికా బెదిరిస్తున్నా, పశ్చిమ దేశాలన్నీ ఇండియాపై కక్షగడుతున్నా సరే ఎవరికీ భయపడకుండా రష్యా తోనే స్నేహం చేస్తున్నాం. దానికి రష్యా కూడా ఇండియాకు తన సంపూర్ణ సపోర్టును ప్రకటిస్తుంది. నిన్న ఇండియాకు వచ్చిన పుతిన్ కీలక ఒప్పందాలను చేసుకున్నారు. భద్రతా, న్యూక్లియర్ ప్లాంటు, డాలర్ తో సంబంధం లేని వాణిజ్యం పై కీలక ఒప్పందాలు జరిగాయి. ఈ మూడు ఇండియా రూపురేఖలను మార్చే పరిస్థితిలు ఉన్నాయి. ప్రపంచంలోనే s 500 కేవలం రష్యా దగ్గరే ఉంది. భద్రతా ఒప్పందంలో భాగంగా దాన్ని ఇండియాకు ఇవ్వడానికి పుతిన్ ముందుకు వచ్చారు. S 500 ఇండియాకు వస్తే అమెరికా, చైనా, వెస్ట్ దేశాలన్నీ భయపడి పోవాల్సిందే. అప్పుడు ఏ దేశం మన మీదకు యుద్ధం వచ్చినా ఇండియానే గెలుస్తుంది. అందుకే రష్యాతో స్నేహం వద్దని ట్రంప్ మనల్ని బెదిరిస్తున్నాడు.
కానీ మనకు నిజమైన మిత్రదేశం ఏది అనేది మోడీకి కూడా తెలుసు. అందువల్లే ఎవరు ఎన్ని బెదిరింపులకు పాల్పడుతున్నా, ట్రంపు ఎన్ని తారీఫులు విధిస్తున్నా సరే రష్యా తోనే మా స్నేహం అంటున్నారు. నిజమే కదా ఆపదలో ఆదుకున్న వాడే మన మిత్రుడు. ఇప్పుడున్న ప్రపంచంలో మనకు నమ్మదగిన, అండగా ఉండే దేశం రష్యా మాత్రమే. అమెరికాతో ఎంత స్నేహపూర్వకంగా ఉన్నా సరే వేరే దేశాలు మన మీదకు యుద్ధానికి వస్తే అమెరికా సపోర్ట్ చేయదు. కానీ రష్యా అలా కాదు. అందుకే రష్యా ఇండియా బంధం ఇలాగే కొనసాగాలని మనమంతా ఆశిద్దాం.