schools closed on October 21 : అన్ని పాఠశాలలకు అక్టోబర్ 21న సెలవు.. ఎందుకంటే

హర్యానాలో పాఠశాలలకు అక్టోబర్ 21న సెలవు ప్రకటించిన పాఠశాల విద్యా డైరెక్టరేట్

Update: 2023-10-19 10:40 GMT

హర్యానా పాఠశాల విద్యా డైరెక్టరేట్ అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు అక్టోబర్ 21, 2023న సెలవు ప్రకటించింది. ప్రభుత్వ పరీక్ష కారణంగా అన్ని పాఠశాలలను మూసివేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. HSSC గ్రూప్ D పరీక్ష 2023 అక్టోబర్ 21న నిర్వహించబడుతోంది. అవసరమైతే పాఠశాలలు ఇతర గెజిటెడ్ సెలవుల్లో తరగతులను నిర్ణయించవచ్చని పాఠశాల అధికారులు తెలిపారు.

'సీఈటీ గ్రూప్ డి పోస్టుల రాత పరీక్ష, పరీక్ష డ్యూటీకి డిప్యూట్ చేయని సిబ్బంది కారణంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు అక్టోబర్ 21, 2023ని నాన్ వర్కింగ్ డేగా ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించిందని దీని ద్వారా తెలియజేస్తున్నాము. పరీక్ష సెన్సిటివిటినీ దృష్టిలో ఉంచుకుని ప్రాంగణంలోకి ప్రవేశంఅనుమతించబడదు' అని అధికారిక నోటిఫికేషన్ లో తెలిపారు

ఈ అధికారిక నోటీసు ప్రకారం, అవసరమైతే, ఈ సెలవుకు బదులుగా, పాఠశాలలు ఏదైనా ఇతర గెజిటెడ్ సెలవు దినాలలో తరగతులను ఏర్పాటు చేయవచ్చని కూడా తెలిపింది.

HSSC గ్రూప్ D పరీక్ష అక్టోబర్ 21, 22 తేదీలలో..

ప్రభుత్వం HSSC గ్రూప్ డి పరీక్షను అక్టోబర్ 2, 22 తేదీలలో వివిధ పరీక్షా కేంద్రాలలో షెడ్యూల్ చేసింది. పరీక్ష రెండు షిఫ్టులలో నిర్వహించబడుతుంది. ఉదయం 10 గంటల నుండి 11.45 గంటల వరకు, సాయంత్రం 3 గంటల నుండి 4.45 గంటల వరకు ఈ పరీక్ష నిర్వహిస్తారు.

అదే సమయంలో, 35 జిల్లాల్లో UPSSSC PET 2023 కారణంగా ఉత్తరప్రదేశ్‌లోని పాఠశాలలు కూడా అక్టోబర్ 28, 29 తేదీలలో మూసివేయబడతాయి. పరీక్షల నిర్వహణను సజావుగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అధికారిక సమాచారం ప్రకారం, దాదాపు 20 లక్షల మంది అభ్యర్థులు ప్రభుత్వ రిక్రూట్‌మెంట్ పరీక్షకు హాజరుకానున్నారు.

Similar News