కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నారు. నేను రాజకీయాల్లోకి రావాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తే, కచ్చితంగా నా కుటుంబ సభ్యుల ఆశీస్సులతో అలాగే చేస్తానని స్పష్టంచేశారు. ప్రముఖ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, 'నా కుటుంబం నుంచి, ముఖ్యంగా నా భార్య ప్రియాంక, బావమ రిది రాహుల్ గాంధీ నుంచి చాలా నేర్చుకున్నా. వాళ్లు పార్లమెంట్లో చాలా చక్కగా పనిచేస్తున్నా రు. ప్రియాంక పార్లమెంట్లో ఉండాలన్నది నా కోరిక. ఇప్పుడు ఆమె ఎంపీగా ఉంది. చాలా కష్టపడి పనిచేస్తోంది. కాంగ్రెస్ పార్టీ నన్ను రాజకీయాల్లో తీసుకురావాలని నిర్ణయిస్తే, విభజన శక్తులతో పోరాడడానికి, దేశాన్ని లౌకికం గా ఉంచడానికి నావంతు కృషిచేస్తా. ఇందుకోసం పార్లమెంట్లో మరిన్ని గొంతుకలు అవసరమని భావిస్తున్నాను' అని వాద్రా తెలిపారు. దేశం నుంచి పారిపోయిన వ్యాపారవేత్త మెహుల్ చోక్సీని బెల్జియంలో అరెస్ట్ చేయడంపై స్పందిస్తూ, మెహుల్ అరెస్ట్ అంశం మనదేశానికి చాలాపెద్ద విషయం. అయితే అతడిని భారత్ రప్పించాలి.. దోచుకున్న సొమ్మును తిరిగి వసూలుచేయాలి. బాధితులకు పరిహారంగా ఇవ్వాలి. దీనిగురించి ప్రభుత్వం ఆలోచన చేయాలి అని వ్యాఖ్యానించారు.