CEC Rajeev Kumar : రిటైర్మెంట్ తర్వాత హిమాలయాలకు వెళ్తా : సీఈసీ రాజీవ్ కుమార్

Update: 2025-01-08 10:45 GMT

కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో తాను పదవీ విరమణ కాబోతున్నానని, బహుశా ఇదే చివరి ప్రెస్ మీట్ అని చెప్పారు. రిటైర్మెంట్ తర్వాత తాను హిమాలయాలకు వెళ్లనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 18న రిటైర్మెంట్ కానున్న రాజీవ్ కుమార్.. తదుపరి ప్రణాళికలేమైనా ఉన్నాయా? అన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. నాకు కొంచెం ఏకాంతం కావాలి. స్వీయ అధ్యయనం కోసం సమయం కావాలి. ఇందుకోసం మీ అందరికీ దూరంగా వెళ్తా. హిమాలయాల్లో సుదూర ప్రాంతానికి వెళ్లి నాలుగైదు నెలలు అక్కడే గడిపేస్తాను. అనవసర అంశాల నుంచి పూర్తి విముక్తి పొందుతా అని అన్నారు. వ్యక్తిగత విషయాలపై స్పందిస్తూ, తాను మున్సిపల్ స్కూళ్లో చదివానని వివరించారు. చెట్టుకింద తరగతుల అనుభవాలు గుర్తుచేస్తూ, ఏబీసీడీలు ఆరో తరగతిలో నేర్చుకున్నానని అన్నారు

Tags:    

Similar News