CPI State Secretary John Wesley మోదీ, అమితాకు నచ్చకుంటే చంపేస్తారా?

Update: 2025-05-27 11:30 GMT

మావోయిస్టులందరిని చంపేస్తామని హోంమంత్రి అమిత్ బహిరంగంగా చెబుతున్నారని, మోదీ, అమితాకు నచ్చకపోతే చంపేస్తారా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ అన్నారు. ట్రాంప్ చెప్తే బీజేపీ ప్రభుత్వం పాకిస్తాన్తో చర్చలు జరిపిందన్నారు. ఇప్పుడు కూడా ట్రంప్ చెబితేనే మావోయిస్టులతో చర్చలు జరుపుతారా? అని జాన్వెస్లీ ప్రశ్నించారు. ఒకరు చనిపోతే.. మరొకరు సంబరాలు చేసుకోవడం అతి దుర్మర్గమైన చర్య అని జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. రామ భక్తులం అని.. రామాలయం కట్టించామని గొప్పలు చెబుతున్న నాయకులు... ఆ విధంగా చేయాలని ఏ ధర్మంలో రాశారని ఆయన ప్రశ్నించారు. ఆడ పిల్లలపై రేప్ చేసి చంపి... మిగతా వారిని తీవ్రంగా కొట్టి చంపారన్నారు. అర్బన్ నక్సల్స్ పేరుతో జరుగుతున్నవి ఎన్ కౌంటర్లు కావని హత్యాకాండేనని ప్రొహర గోపాల్ అన్నారు. మావోయిస్టులు డెడ్ బాడీలను బంధువులు, తల్లిదండ్రులు అడిగితే.. ఇవ్వకుండా వాళ్లే కాల్చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం అర్బన్ నక్సల్ పేరుతో అమాయకుల ను చంపి మారణహోమం సృష్టిస్తోందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. టెర్రరిస్టులు, దేశ ద్రోహులతో చర్చలు జరుపు తారు కానీ దేశం లోపలి సమస్యలపై పోరాటం చేస్తున్న వారిని చంపేస్తారా అని ఆయన ప్రశ్నించారు. 'చర్చలు జరపండి అంటే.. ఇంత దారుణంగా చంపుతారా? కనీసం వాళ్ల డెడ్ బాడీలను అప్పగించారా? ముస్లింలు, క్రిస్టియన్ లు, కమ్యూనిస్టులు ఉండొద్దని వారి ఉద్దేశ్యం. ప్రశ్నించే వాళ్లు ఉండొద్దనేది వాళ్ల ఆలోచన. ' అని కూనంనేని అన్నారు.

Tags:    

Similar News