HIGH COURT: సహ జీవనం చేసి రేప్ అంటే చెల్లదు
కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు.. ఇష్టపడి కలిసి ఉండి అత్యాచారం అంటే చెల్లదన్న కోర్టు
సహజీవనంపై కర్ణాటక హైకోర్టు(Karnataka HC) కీలక తీర్పు వెల్లడించింది. ఒక పురుషుడు, మహిళ ఇష్టపడి కలిసి ఉండి.. ఆ తర్వాత మహిళ అత్యాచారం ఆరోపణలు చేస్తే చెల్లదని(Woman can't allege rape) ఓ తీర్పులో స్పష్టం చేసింది. దావణగెరెకు చెందిన ఓ మహిళ, బెంగళూరుకు చెందిన ఒక పురుషుడు ఆరేళ్లుగా సన్నిహితంగా( 6 years of consensual sex) ఉన్నారు. పురుషుడు వివాహానికి నిరాకరించడంతో తనపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపిస్తూ మహిళ 2021లో బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దీనిని సవాల్ చేస్తూ అతడు హైకోర్టును ఆశ్రయించాడు.
ఇద్దరి ఆమోదంతోనే తమ సంబంధం కొనసాగిందని ఆ వ్యక్తి హైకోర్టుకు తెలిపాడు. ఇరువర్గాల వాదనలను ఆలకించిన జస్టిస్ నాగప్రసన్న ధర్మాసనం మహిళ ఆరోపణలను తోసిపుచ్చింది. ఆరేళ్లు సుదీర్ఘ సంబంధం ఉండడం వల్ల ఆమె చేసే అత్యాచారం అభియోగాలు చెల్లవని అభిప్రాయపడింది. ఒక పురుషుడు, మహిళ ఇష్టపడి కలిసి ఉండి తర్వాత రేప్ చేశాడంటూ ఆరోపణలు చేయడం సరికాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.