Maharashtra : పక్షవాతంతో మంచంపట్టిన భర్త.. ప్రియుడితో కలిసి చంపేసిన భార్య

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో దారుణం;

Update: 2025-07-08 03:06 GMT

 అక్రమ సంబంధాలు భార్యాభర్తల బంధంలో చిచ్చుపెడుతున్నాయి. పరాయి వ్యక్తుల మోజులో పడి భర్తలను అంతమొందిస్తున్నారు కొందరు భార్యలు. తాజాగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ, ప్రియుడితో కలిసి మంచం పట్టిన భర్తను దిండుతో గొంతు నులిమి హత్య చేసి, దానిని సహజ మరణంలా చిత్రీకరించడానికి ప్రయత్నించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

దిశా రామ్‌టేకే  , చంద్రసేన్ రామ్‌టేకే  ,13 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. సుమారు రెండు సంవత్సరాల క్రితం, భర్త పక్షవాతం బారిన పడ్డాడు. ఈ నేపథ్యంలో భర్త తరచుగా తన భార్య ప్రవర్తనపై అనుమానాలు వ్యక్తం చేసేవాడు.

కాగా రెండు నెలల క్రితం, దిశాకు, మెకానిక్ ఆసిఫ్ ఇస్లాం అన్సారీ అలియాస్ రాజబాబు టైర్‌వాలాతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగామారి అక్రమసంబంధానికి దారితీసింది. ఈ వ్యవహారం చంద్రసేన్ రామ్‌టేకే తెలిసింది. దీంతో వివాదం చెలరేగింది. భర్తను అడ్డుతొలగించుకునేందుకు ప్రియుడితో కలిసి ప్లాన్ చేసింది. చంద్రసేన్ ఇంట్లో నిద్రిస్తున్నప్పుడు దిశ ఆసిఫ్‌ను ఇంటికి పిలిచింది. ఆమె తన భర్తను మంచం మీద నుంచి కిందకి దింపింది. ఆసిఫ్ అతని ముఖంపై దిండును పెట్టి అతను చనిపోయే వరకు ఊపిరాడకుండా చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. దిశా మొదట్లో భర్త మరణాన్ని సహజ మరణంగా చిత్రీకరించడానికి ప్రయత్నించగా, పోస్ట్‌మార్టం నివేదికలో అది హత్య అని తేలింది. తరువాత, పోలీసుల విచారణలో ఆమె నేరాన్ని అంగీకరించింది. భర్తలను చంపుతున్న ఘటనలు వరుసగా చోటుచేసుకుంటుండడంతో యువకులు పెళ్లి చేసుకోవాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు.

Tags:    

Similar News