Commonwealth Games 2022: కామన్వెల్త్‌లో భారత్ జోష్.. మొత్తం 18 పతకాలతో..

Commonwealth Games 2022: కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్ సత్తా చాటుతోంది.

Update: 2022-08-04 16:15 GMT

Commonwealth Games 2022: కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్ సత్తా చాటుతోంది. బ్యాడ్మింట‌న్ సింగిల్స్‌లో భార‌త ష‌ట్లర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీ‌కాంత్ ప్రీ-క్వార్టర్‌ ఫైన‌ల్స్‌లోకి దూసుకెళ్లారు. మాల్దీవులుకు చెందిన ఫాతిమాహ్ న‌బామా అబ్దుల్ ర‌జాక్‌ను సిందూ చిత్తుగా ఓడించారు. మ‌రో షట్లర్ కిదాబి శ్రీ‌కాంత్.. మెన్స్ సింగిల్స్‌లో ఉగాండ‌కు చెందిన డానియ‌ల్ వాన‌గ‌లియాను 21-9, 21-9 తేడాతో ఓడించి ప్రీ క్వార్టర్‌ ఫైన‌ల్స్‌లోకి ఎంట‌రయ్యాడు.

ఇప్పటికే రెండుసార్లు ఒలింపిక్స్‌లో ప‌త‌కాలు సాధించిన సింధూ.. త‌న మాల్దీవులు ప్రత్యర్థి ఫాతిమాహ్‌పై సునాయాస విజ‌యం సాధించింది. మిక్స్‌డ్ టీం ఫైన‌ల్స్‌లో మ‌లేషియాకు చెందిన జేయంగ్ ఎన్‌పై సింగిల్స్ మ్యాచ్ ఓడిపోయిన కిడాంబి శ్రీ‌కాంత్‌.. త‌న సింగిల్స్ విభాగంలో ఉగాండ ప్రత్యర్థిపై తేలిగ్గా విజ‌యం సాధించారు. కామన్వెల్త్ గేమ్స్‌లో బాక్సర్ అమిత్ పంఘల్ భారత్‌కు మరో పతకం ఖాయం చేశాడు.

స్కాట్లాండ్ బాక్సర్ లెనన్ ములిగన్‌తో జరిగిన ఫ్లైవెయిట్ క్వార్టర్ ఫైనల్‌లో విజయం సాధించిన అమిత్ సెమీస్‌కు దూసుకెళ్లి కనీసం కాంస్య పతకం ఖాయం చేశాడు. మరో ముగ్గురు బాక్సర్లు క్వార్టర్స్‌లో తలపడుతున్నారు. వారు కూడా సెమీస్‌కు దూసుకెళ్తే పతకాలు ఖాయమైనట్టే. అథ్లెటిక్స్‌లో హిమదాస్ 200 మీటర్ల సెమీస్‌లోకి ప్రవేశించింది. కామన్వెల్త్‌లో భారత్‌కు ఇప్పటి వరకు 18 పతకాలు లభించాయి. ఇందులో ఐదు స్వర్ణాలు ఉన్నాయి.  

Tags:    

Similar News