బీజేపీ మహాజన సంపర్క్ అభియానలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ఈ నెలాఖరులో రాష్ట్రంలో పర్యటించనున్నారు. నల్లగొండ లేదా మల్కాజిగిరిలో ఏర్పాటు చేసే బహిరంగసభకు మోదీ హాజరవుతారు. ఈ నేపథ్యంలో ఖమ్మంలో పార్టీ నేతలతో బండి సంజయ్ సమీక్ష నిర్వహించారు. ఈనెల 15న ఖమ్మంలో నిర్వహించనున్న బహిరంగ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నారని, ఈ నేపథ్యంలో కనీసం లక్ష మంది జనసమీకరణ చేయాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. పార్టీని బలోపేతం చేసే క్రమంలో అమిత్ షా ఆధ్వర్యంలో 15న బహిరంగసభ నిర్వహించనున్నారు.