చీకోటికి మరోసారి ఈడీ నోటీసులు
మే12 హైదరాబాద్ కు చీకోటి ప్రవీణ్; ఈడీ ముందు హాజరైయ్యే అవకాశం;
థాయ్‌లాండ్ ఘటన తర్వాత చికోటి ప్రవీణ్‌కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఫెమా నిబంధనలను ఉల్లఘించారని చీకోటితో పాటు చిట్టి దేవేందర్, సంపత్, మాధవరెడ్డిలకు కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. సంపత్ ఇప్పటికే ఈడీ విచారణకు హాజరయ్యారు. మరో ముగ్గురికి తమ ఎదుట హాజరుకావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. ప్రవీణ్ మే12న థాయ్‌లాండ్ నుంచి హైదరాబాద్ రానున్నారు. వచ్చేవారంఈడీ ముందు హాజరైయ్యే అవకాశం ఉంది.ఈ సందర్భంగా చీకోటి ప్రవీణ్ కు ఎలాంటి ప్రశ్నలు వేయనున్నారు అనే దానిపై ఆసక్తి నెలకొంది.