జగజ్జనని చిట్ ఫండ్ కేసులో నిందితులకు బెయిల్
డిపాజిట్ దారుల ఫిర్యాదు లేకుండానే కేసు నమోదు చేయడంతో బెయిల్ మంజూరు;
జగజ్జనని చిట్ ఫండ్ కేసులో ఆ సంస్థ ఎండీ ఆదిరెడ్డి అప్పారావు, డైరెక్టర్ ఆదిరెడ్డి శ్రీనివాస్‌కు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. చిట్‌ఫండ్ కేసులో ఏపీ సీఐడీ వీరిద్దరినీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆదిరెడ్డి అప్పారావు, శ్రీనివాస్ తరపున సీనియర్ న్యాయవాదులు దమ్మాలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు వాదనలు విన్పించారు. చిట్ ఫండ్ చట్టం ఈ కేసుకు వర్తించదని పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదించారు. డిపాజిట్ దారుల ఫిర్యాదు లేకుండానే కేసు నమోదు చేశారని పిటిషనర్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆదిరెడ్డి అప్పారావు, శ్రీనివాస్ రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు.