యర్రగొండపాలెం ఘటనపై NSG సీరియస్
తాజా ఘటనతో పాటూ నందిగామ ఘటనపై సంపూర్ణ నివేదిక;
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్‌పై వైసీపీ రాళ్ల దాడి ఘటనను NSG హెడ్‌క్వార్టర్స్ సీరియస్‌గా తీసుకుంది. NSG కమాండెంట్‌కు రాళ్ల దాడిలో గాయాలు కావడంపై హెడ్ క్వార్టర్స్ ఆరా తీసింది. యర్రగొండపాలెం పోలీసులకు ఘటనపై ఫిర్యాదు చేయాలని ఆదేశించింది. గతంలో నందిగామ, ఇప్పుడు యర్రగొండపాలెం దాడి ఘటనలపై NSG బృందం నివేదిక ఇచ్చింది. దీనిపై నేడో, రేపో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. చంద్రబాబు దగ్గర వరకు ఆందోళనలను రానివ్వడంపై NSG బృందం అభ్యంతరం వ్యక్తం చేసింది.