Stone Quarry: మిజోరంలో భారీ వర్షాలతో కూలిన గ్రానైట్ క్వారీ.
పది మంది మృతి;
మిజోరంలో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. ఐజ్వాల్ జిల్లాలో గ్రానైట్ క్వారీ కూలడంతో పది మంది కార్మికులు మరణించారు. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. పోలీసులు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. అయితే ఆ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందని అధికారులు తెలిపారు. నిరాటంకంగా కురుస్తున్న వర్షాల వల్ల ఇప్పటికే రాష్ట్రంలో పాఠశాలలకు సెలవు ఇచ్చామని, ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేయాలని కోరిట్లు వెల్లడించారు. కొండ చరియలు విరిగిపడటంతో పలు జాతీయ రహదారులు, ప్రధాన రోడ్లను మూసివేసినట్లు తెలిపారు. ఇక, జాతీయ రహదారి 6పై కొండ చరియలు విరిగిపడటంతో.. ఐజ్వాల్‌కు ఇతర ప్రాంతాలతో ఉన్న సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. మరో రెండ్రోజులు అస్సాం తదితర ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని భారత వాతావారణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది.