ఉత్తప్రదేశ్‌లోని ఇటావాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం అర్ధరాత్రి ఇటావాలోని మానిక్‌పూర్ క్రాసింగ్ వద్ద జాతీయ రహదారి-2పై అదుపుతప్పిన ట్రక్కు రోడ్డు పక్కనున్న దాబాలోకి దూసుకెళ్లింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. జార్ఖండ్ రిజిస్ట్రేషన్ కలిగిన ట్రక్కు కాన్పూర్ నుంచి ఢిల్లీ వైపు వెళ్తున్నదని ఎస్‌ఎస్పీ సంజయ్ వర్మా చెప్పారు. డ్రైవర్‌ను అరెస్టు చేశామని, అతడు మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించామన్నారు. జేసీబీ, క్రేన్ సహాయంతో ట్రక్కును అక్కడి నుంచి తొలగించామని తెలిపారు. గాయపడిన వారిపరిస్థితి విషమంగా ఉందన్నారు.