collapses: వివాహం వేళ విషాదం
భారీ వర్షాలకు కూలిన పెళ్లి మండపం.. ఎనిమిది మందికి గాయాలు;
వివాహ సంబరాల్లో మునిగిపోయిన వేళ విషాదం సంభవించింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి పెళ్లి మండపం కూలి ఎనిమిది గాయపడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. మధ్యప్రదేశ్‌లోని దామోహ్‌లో వివాహం జరుగుతుండగా భారీ వర్షం కురిసింది. దీనికితోడు భీకరంగా గాలులు వీచాయి. దీంతో పెళ్లి మండపం ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో ఎనిమిది గాయపడగా... వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అందులో ఒకరికి తీవ్ర గాయలయ్యాయని... ఆ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అతడిని హుటాహుటిన జబల్‌పూర్‌లోని వేరే ఆస్పత్రికి తరలించారు.