ACB COURT: ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు
రోజుకు రెండుసార్లు లీగల్ ములాఖత్‌లకు అనుమతి... మధ్యంతర ఉత్తర్వులు జారీ;
రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుతో ములాఖత్‌లు పెంచాలని ఆయన తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్‌పై విజయవాడలోని ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రోజుకు రెండు సార్లు లీగల్ ములాఖత్‌కు అనుమతిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. రోజుకు 3సార్లు లీగల్ ములాఖత్ ఇవ్వాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్‌పై ఏసీబీ కోర్టు విచారణ జరిగింది. వివిధ కోర్టుల్లో కేసుల విచారణ జరుగుతున్నందున పిటిషన్లపై ఆయనతో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. ములాఖత్ ఇవ్వకుండా జైలు అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబుతో రోజుకు రెండు సార్లు లీగల్ ములాఖత్‌కు అనుమతిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.