Kurnool: సర్కారు తీరుపై అంగన్‌వాడీల నిరసన
శ్రీకృష్ణదేవరాయ ధర్నా సర్కిల్ వద్ద 36 గంటల మహాధర్నా;
జగన్ సర్కారు తీరును నిరసిస్తూ కర్నూలులో అంగన్‌వాడీ వర్కర్లు ఆందోళన చేపట్టారు. శ్రీకృష్ణదేవరాయ ధర్నా సర్కిల్ వద్ద 36 గంటల మహాధర్నా నిర్వహించారు. అంగన్‌వాడీల నిరసనకు సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు గఫూర్ మద్దతు తెలిపారు. సీఎం జగన్ ప్రజలను మోసం చేసినట్లే అంగన్‌వాడీ వర్కర్లను నయవంచన చేశారని గఫూర్ ఆరోపించారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే రిలే, ఆమరణ నిరాహార దీక్షలకు దిగుతామని అంగన్‌వాడీలు హెచ్చరించారు.