మొబైల్ తయారీ దిగ్గజ సంస్ధ యాపిల్ హైదరాబాద్ వేదికగా తమ ఉత్పత్తులను ప్రారంభించేందుకు సిద్ధమైంది. వైర్‌లెస్ ఇయర్ బడ్స్ ఎయిర్‌పాడ్స్‌ను హైదరాబాద్‌లోని తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్ సంస్థ ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీలో ఉత్పత్తి చేయనుంది. హైదరాబాద్‌లో తమ ప్లాంటు కోసం ఫాక్స్‌కాన్ సంస్థ 500 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు అనుమతులిచ్చింది. ఈ ప్లాంటు ద్వారా వచ్చే ఏడాది నుంచి ఉత్పత్తులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మనదేశంలో ఐఫోన్ తర్వాత యాపిల్ సంస్థ నుంచి రెండో ఉత్పత్తి ఎయిర్‌పాడ్స్ కావడం విశేషం.