ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ 16 విక్రయాలు నేటినుంచి ప్రారంభమయ్యాయి. ఏఐ సాంకేతిక తరహాలో యాపిల్ ఇంటెలిజెన్స్ తో శక్తివంతంగా రూపొందించిన ఈ ఫోన్‌లను కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారులు యాపిల్ స్టోర్‌ల ముందు భారీగా క్యూ కట్టారు. ముంబై, ఢిల్లీతో సహా పలు యాపిల్ స్టోర్‌ల బయట కొనుగోలుదారులు పెద్దఎత్తున బారులు తీరారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఇందులో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రొ, ఐఫోన్ ప్రొ మ్యాక్స్.. అనే నాలుగు మోడళ్లను యాపిల్ తీసుకొచ్చింది. వీటిల్లో అధునాతన కెమెరా కంట్రోల్ బటన్, యాక్షన్ బటన్ అనే రెండు కొత్త బటన్లను జత చేశారు. అదేవిధంగా ప్రత్యేకంగా తయారైన కొత్త చిప్ ఏ18తో వచ్చింది. ఐఫోన్ 16 ప్రారంభ ధర రూ. 79,900గా, ఐఫోన్ 16 ప్లస్ ప్రారంభ ధర రూ.89,900గా ఉంది.