కర్నాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు.రోడ్డుపై అడ్డంగా బైక్ రైడింగ్ చేస్తూ ఇతర వాహనదారులను ఇబ్బందిపెడుతున్నారు.సైడ్ ఇవ్వకుండా అడ్డదిడ్డంగా బైక్‌లను నడిపుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు కొందరు యువకులు. ఈస్ట్ బెంగళూరులో కొందరు యువకులు ఓ కారుకు అడ్డంగా బైక్ నడుపుతూ వింతగా ప్రవర్తించారు. అయితే సైడ్ ఇమ్మన పాపానికి కారులోని వారిపై దాడికి దిగారు. అయితే ఆకతాయిల వికృత చేష్టలను రికార్డ్ చేసిన కారు లోని ప్రయాణికులు.. ఆ వీడియోను కర్నాటక డీజీపీకి పంపారు. మరి ఈ ఆకతాయిలపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.