ఏపీని సీఎం జగన్ బీహార్‌లా మార్చేశారని మండిపడ్డారు టీడీపీ విశాఖ నేత భరత్. ఏపీలో ఎవరికి రక్షణ లేకుండా పోయిందని..వైసీపీ నేతల అరాచకాలకు అడ్డే లేకుండా పోతుందని ఫైర్ అయ్యారు.విశాఖలో రాజధాని సంగతి ఏమో కానీ.. ఉన్న భూములు దోచేస్తున్నారని అన్నారు. జగన్ పాలనలో ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని అన్నారు. వైసీపీ పాలనలో విశాఖని క్రైమ్ సిటీగా మార్చేశారన్నారు.