జగన్ సర్కార్‌పై బీజేపీ ఎంపీ జీవీయల్ ఫైర్ అయ్యారు. విశాఖ సభలో అమిత్‌షా ప్రసంగాన్ని చూసి వైసీపీ నేతల్లో భయం మొదలైందని అన్నారు.రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు,అన్యాయాలను అమిత్‌షా వివరించారని తెలిపారు. ఓ ఎంపీ కుటుంబానికే రక్షణ లేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని, విశాఖలో క్రైం థ్రిల్లర్ ను మరిపించే ఘటన జరిగిందని అన్నారు. ఓ చిన్న పిల్లాడిని పెట్రోల్ పోసి తగులబెట్టడం దారుణమన్న జీవీఎల్ వైసీపీ వారే నిందితులుగా ఉంటే జగన్ ఏం చెబుతారని ప్రశ్నించారు. మేం మనుషులం కాదు రాక్షస సంత అని ఒప్పుకోండని వైసీపీ నేతలను డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇన్ని నేరాలు,ఘోరాలు జరుగుతున్నా సీఎం సైలెంట్‌గా ఉన్నారని మండిపడ్డారు జీవీఎల్.