Mexico: మెక్సికో అధ్యక్షురాలికి నడిరోడ్డుపై లైంగిక వేధింపులు
మెక్సికోలో దిగ్భ్రాంతికర ఘటన
మెక్సికోలో దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. ఏకంగా ఆ దేశాధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ నడిరోడ్డుపై లైంగిక వేధింపులు ఎదుర్కోవడం కలకలం సృష్టించింది. మిచొకాన్‌లో ఆమె మంగళవారం ఓ బహిరంగ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ క్లాడియా ప్రజలతో మాట్లాడుతుండగా.. వెనుక నుంచి వచ్చిన ఓ వ్యక్తి చేయి వేస్తూ.. ఆమెను ముద్దు పెట్టుకోబోయాడు. వెంటనే భద్రతా సిబ్బంది అతడిని పక్కకు నెట్టారు. అయినప్పటికీ అతడు క్లాడియాను అసభ్యంగా తాకుతుండడంతో ఆమె ఇబ్బంది పడుతూ.. అతడి చేతిని పక్కకు నెట్టారు. ఆ వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్లు క్లాడియా బుధవారం తెలిపారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.