Commercial LPG: మరోసారి తగ్గిన వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధర..

నేటి నుంచి అమల్లోకి..;

Update: 2025-08-01 01:00 GMT

వాణిజ్య అవసారలకు వినియోగించే 19 కేజీల ఎల్పీజీ సిలిండర్‌ ధర  మరోసారి తగ్గింది. ప్రతి నెల ఒకటో తేదీన సిలిండర్‌ ధరల్లో మార్పులు చేస్తున్న ఆయిల్‌ కంపెనీలు.. తాజాగా వాణిజ్య సిలిండర్‌ ధరను రూ.33.50 తగ్గించాయి. తగ్గిన ధరలు శుక్రవారం నుంచే అమల్లోకి వస్తాయని ప్రకటించాయి. తగ్గించిన ధరతో ఢిల్లీలో రూ.1665గా వాణిజ్య సిలిండర్‌ రూ.1631.50గా ఉంది. కోల్‌కతాలో రూ.1735.50, ముంబైలో రూ.1616.50, చెన్నై రూ.1790 కు తగ్గింది. రాష్ట్రాల వారీగా ఈ తగ్గింపులో మార్పు ఉంటుంది.

ఇక గృహావసరాలకు వినియోగించే 14.2 కేజీల సిలిండర్‌ ధరలో ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీలో రూ.853గా ఉండగా, కోల్‌కతాలో రూ.879, ముంబైలో రూ.852.50, చెన్నైలో రూ.868.50, హైదరాబాద్‌లో రూ.905గా ఉన్నది. ఈ ఏడాది ఏప్రిల్‌లో డొమెస్టిక్‌ సిలిండర్‌ ధర రూ.50 పెరిగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి సిలిండర్‌ ధరలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు.

Tags:    

Similar News