DELHI LIQUOR SCAM: మనీష్ సిసోడియాకు బెయిల్ నిరాకరణ
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు మళ్లీ నిరాశ తప్పలేదు.;
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు మళ్లీ నిరాశ తప్పలేదు. బెయిల్ ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు మరోసారి తిరస్కరించింది. సిసోడియాతో పాటు విజయ్ నాయర్, బోయిన్‌పల్లి అభిషేక్, బినోయ్ బాబుల బెయిల్ పిటిషన్లను కూడా హైకోర్టు కొట్టివేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మార్చి 9న మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యారు. అనంతరం ఆయన భార్య అస్వస్థతకు గురి కావడంతో పలుమార్లు తనకు బెయిల్ ఇవ్వాలని సిసోడియా హైకోర్టులో అప్పీల్ చేశారు. సిసోడియాపై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవని బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని హైకోర్టు స్పష్టంచేసింది.