ఏపీ వ్యాప్తంగా లక్షల్లో దొంగ ఓట్లు

Update: 2023-07-01 12:11 GMT


ఏపీ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో దొంగ ఓట్లు బయటపడటం కలకలం రేపుతోంది. ఒక్క చంద్రగిరి నియోజకవర్గంలోనే 19వేల దొంగ ఓట్లను గుర్తించారు టీడీపీ నేతలు. డోర్‌ నెంబర్‌లోని ఇండ్లకు 10కి పైగా బోగస్‌ ఓట్లు నమోదు చేశారని టీడీపీ నేత పులివర్తి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగ ఓట్లపై తిరుపతి ఆర్డీఓను కలిసి ఫిర్యాదు చేశారు. తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. కొందరు ప్రభుత్వ అధికారులే వైసీపీ నేతలకు సహకరిస్తున్నారంటూ విమర్శించారు. ఇందులో వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హస్తం ఉందని పులివర్తి నాని ఆరోపించారు. నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ కోరారు. 

Tags:    

Similar News