చిత్తూరులో కాల్పులు కలకలం రేపాయి. గాంధీరోడ్డులోని లక్ష్మీ సినిమా హల్ సమీపంలో ఉన్న పుష్ప కిట్ వరల్డ్ షాపింగ్ మాల్ యజమాని ఇంట్లోకి దుండగులు చొరబడి రెండు తుపాకులతో కాల్పులు జరిపారు. అయితే యజమాని అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. వెంటనే అప్రమత్తమైన యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. యజమాని నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. షాపింగ్ మాల్ యజమాని ఇంట్లో కాల్పులు జరిపిన ఘటనలో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్ని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిందితుల వద్ద నుంచి రెండు తుపాకులు, కొన్ని బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ మణికంఠ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.