Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో మరోసారి కాల్పులు..
ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులతో పాటు డీఆర్జీ హెడ్ కానిస్టేబుల్ మృతి..;
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ రీజియన్ మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. నారాయణ్‌పూర్-దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లోని దండకారణ్యంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. వావోయిస్టుల కాల్పుల్లో డీఆర్‌జీ కానిస్టేబుల్ చనిపోయారు. శనివారం అర్ధరాత్రి అబుబ్‌మడ్‌లోని అటవీ ప్రాంతంలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG), సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. ప్రతిగా భద్రతా బలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మరణించారు. మావోయిస్టుల కాల్పుల్లో దంతెవాడ డీఆర్‌జీ హెడ్ కానిస్టేబుల్ సన్ను కరమ్ ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలంలో ఏకే 47తోపాటు సెల్ఫ్ లోడింగ్ రైఫిళ్లు (SLR) స్వాధీనం చేసుకున్నామని అధికారులు వెల్లడించారు.అయితే, ఇంకా భద్రతా బలగాలు, మవోయిస్టుల మధ్య కాల్పులు కొనసాగుతున్నట్లు తెలిపారు.