Happy Birthday: మాస్టర్ బ్లాస్టర్ @50
50వ పడి లోకి అడుగుపెట్టిన సచిన్ టెండుల్కర్;
ఇండియన్ క్రికెట్ ఐకాన్ సచిన్ రమేశ్ టెండూల్కర్ ఇవాళ 50వ వసంతంలోకి ప్రవేశించారు. ముంబైలోని ఓ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన సచిన్ పదిహేనేళ్ల వయస్సులోనే 1987-88లో స్నేహితుడు వినోద్ కాంబ్లీతో కలసి వరల్డ్ రికార్డు భాగస్వామ్యంతో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించాడు. జంటిల్‌మెన్ గేమ్ తో క్రికెట్‌కు కేరాఫ్‌గా మారాడు. 2012లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి పదేళ్లు అవుతున్నా ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.