Alexander Duncan: హనుమాన్ విగ్రహంపై రిపబ్లికన్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

క్రైస్తవ దేశంలో ఆ దేవుడి విగ్రహం ఎందుకు?

Update: 2025-09-24 02:04 GMT

అమెరికాలో ఏర్పాటు చేసిన హనుమాన్ విగ్రహంపై రిపబ్లికన్ నేత అలెగ్జాండర్ డంకన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. టెక్సాస్‌లో హనుమాన్ విగ్రహం ఏర్పాటుకు ఎలా అనుమతి ఇచ్చారంటూ వ్యాఖ్యానించారు. డంకన్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో వ్యతిరేకత వ్యక్తమైంది. హిందూ అమెరికన్ ఫౌండేషన్.. డంకన్ వ్యాఖ్యలను తిప్పికొట్టింది. ఈ విషయాన్ని పరిష్కరించాలని టెక్సాస్‌లోని రిపబ్లికన్ పార్టీకి ఫిర్యాదు చేశారు.

2024లో టెక్సాస్‌లో హనమాను విగ్రహం ఏర్పాటు చేశారు. స్టాట్యూ ఆఫ్ యూనియన్ ఆవిష్కరించారు. యూఎస్‌లో ఎత్తైన హిందూ స్మారక చిహ్నాలలో ఇదొకటి. అమెరికాలోనే మూడో ఎత్తైన విగ్రహం ఇదే. 90 అడుగుల ఎత్తులో ఈ విగ్రహాన్ని నిర్మించారు. టెక్సాస్‌లోని షుగర్ ల్యాండ్ పట్టణంలోని శ్రీ అష్టలక్ష్మి ఆలయంలో ఈ విగ్రహాన్ని నెలకొల్పారు.

Tags:    

Similar News