సిద్ధిపేటలో యోగా దినోత్సవ వేడుకలు
మంత్రి హరీష్రావు ముఖ్య అతిధిగా పాల్గొని యోగాసనాలు వేశారు.
సిద్ధిపేటలో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రి హరీష్రావు ముఖ్య అతిధిగా పాల్గొని యోగాసనాలు వేశారు. ప్రతిరోజు ఓ గంట యోగా, ప్రాణామాయం చేస్తే మంచి ఆరోగ్యాన్ని పొందంచన్నారు మంత్రి హరీష్. యోగ నిత్య జీవితంలో భాగమైందని వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ యోగా చేయాలన్నారు హరీష్. రోగాల బారిన పడినప్పుడు కాకుండా ప్రతిరోజూ చేస్తే దీర్ఘాయుష్షు లభిస్తుందన్నారు