ఇజ్రాయెల్ వైద్యులు అధ్బుతం సాధించారు. దాదాపుగా తెగిపోయిన తలను తిరిగి అతికించి ఓ బాలుడికి పునర్జన్మనిచ్చారు. ఇజ్రాయెల్‌కు చెందిన 12 ఏండ్ల బాలుడు సులేమాన్ హసన్ సైకిల్‌పై వెళ్తుండగా కారు బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో హసన్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడి తల భాగం మెడ నుంచి దాదాపు వేరయింది. వెంటనే అతడిని విమానంలో హదస్సా మెడికల్ సెంటర్‌కు తరలించారు. వైద్యులు కొన్ని గంటలపాటు శ్రమించి, తెగిపోయిన అతడి తలను తిరిగి అతికించారు. ఇది కచ్చితంగా అద్భుతమేనని వైద్యులు తెలిపారు.