Jamili Elections: జమిలి ఎన్నికలు అప్రజాస్వామికం కాదు

సంయుక్త పార్లమెంటరీ సంఘం ఎదుట న్యాయశాఖ స్పష్టీకరణ;

Update: 2025-02-25 01:33 GMT

లోక్‌సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించడం అప్రజాస్వామికం కాదని, దీనివల్ల సమాఖ్య వ్యవస్థకు ఎటువంటి హాని జరగదని కేంద్ర న్యాయ శాఖ తెలిపింది. ‘ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు’ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లులను సంయుక్త పార్లమెంటరీ సంఘం పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే. విశ్వసనీయ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, ఈ సంఘం సభ్యుల ప్రశ్నలకు ఈ మంత్రిత్వ శాఖలోని లెజిస్లేటివ్‌ డిపార్ట్‌మెంట్‌ స్పందించింది.

 మన దేశంలో గతంలో 1951 నుంచి 1967 వరకూ జమిలి ఎన్నికలు జరిగిన విషయాన్ని గుర్తుచేసింది. తర్వాత కొన్ని రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధింపు సహా పలు ఇతర కారణాల వల్ల జమిలి ప్రక్రియ ఆగిపోయిందని పేర్కొంది. కమిటీ వేసిన మరికొన్ని ప్రశ్నలకు పూర్తి వివరాలతో బదులిచ్చేందుకుగాను.. ఆ ప్రశ్నలను ఎన్నికల సంఘానికి న్యాయ శాఖ పంపినట్లు సమాచారం. ఈ అంశంపై తదుపరి సమావేశాన్ని కమిటీ మంగళవారం నిర్వహించనుంది.


Tags:    

Similar News