ఇంత హంగామా అవసరమా!
ఎంపీ అవినాశ్ రెడ్డి వ్యవహారంపై జేసీ ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు;
కడప ఎంపీ అవినాష్‌రెడ్డిపై తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్కడిని అరెస్టు చేయడానికి ఇంత హంగామా చేస్తారా? అంటూ ప్రశ్నించారు. హత్య కేసులోని నిందితుడ్ని అరెస్టు చేయడానికి దేశాన్ని కాపాడే సైన్యం అవసరమా అని నిలదీశారు. వివేకా కేసులో విచారణకు అవినాష్‌రెడ్డి వెళ్లకుండా శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్నారని జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు.