Johnny Master : జాలి గుండె చాటుకున్న జానీ మాస్టర్

Update: 2024-10-28 12:15 GMT

పోక్సో కేసులో జైలుకు వెళ్లి బెయిల్ పై విడుదలైన సినిమా డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్ తన పెద్దమనసు చాటుకున్నారు. యాక్సిడెంట్‌ అయిన వ్యక్తిని దగ్గరుండి 108లో ఆస్పత్రికి తరలించారు. జానీ మాస్టర్‌ హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తుండగా.. ఒక వ్యక్తి యాక్సిడెంట్‌ అయి తీవ్ర గాయాలతో పడిఉండటాన్ని గమనించారు. దాంతో జానీ మాస్టర్‌ తన కారు ఆపి..108కి ఫోన్‌ చేసి బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. జానీ చేసిన సాయంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. కేసుల ఒత్తిడిలో ఉండి కూడా ఇలా సాయం చేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

Tags:    

Similar News