మాయమాటలతో మూడోసారి ముఖ్యమంత్రి కావాలని కేసీఆర్ అనుకుంటున్నారని..ఆ కోరికను నెరవేరనీయబోమన్నారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి.ఇబ్బందులుంటాయని తెలిసినా తెలంగాణ ప్రజల కోసమే కాంగ్రెస్‌లో చేరుతున్నామన్నరు. ఆరు నెలలుగా ప్రముఖ సంస్థలతో సర్వేలు చేయించామన్నారు. కాంగ్రెస్‌లో చేరాలనే అందరూ అభిప్రాయం వ్యక్తం చేశారని తెలిపారు. ఖమ్మంలో జులై 2న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి రాహుల్ సమక్షంలో చేరనున్నట్లు ప్రకటించారు.