కేసీఆర్ పర్యటన సందర్భంగా నాగ్‌పూర్ గులాబీ మయమైంది. పట్టణమంతా బీఆర్‌ఎస్ ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు, జెండాలే కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కేసీఆర్ హోర్డింగ్‌లు, స్వాగత తోరణాలు దర్శనమిస్తున్నాయి. నాగ్‌పూర్ లోని గాంధీబాగ్‌లో నిర్మించిన మహారాష్ట్ర బీఆర్‌ఎస్ భవన్‌ను కేసీఆర్ ప్రారంభించనున్నారు. కేసీఆర్‌కు స్వాగతం పలికేందుకు బీఆర్‌ఎస్ శ్రేణులు పెద్త ఎత్తున ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అబ్ కి బార్ కిసాన్ సర్కార్ నినాదాలతో హోరెత్తించారు.