Harish Rao: జహీరాబాద్‌లో పోడు పట్టాలను పంపిణీ చేసిన మంత్రి
పోడు పట్టాలు అందుకున్న రైతులకు 10 రకాల ప్రయోజనాలు;
గత పాలకులు గిరిజనులను ఓటు బ్యాంకుగా వాడుకున్నాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు. పోడు భూములకు పట్టం కట్టి గిరిజనుల్ని రైతులను చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. జహీరాబాద్‌లో గిరిజనులకు మంత్రి హరీశ్‌రావు పోడు పట్టాలను పంపిణీ చేశారు. పోడు పట్టాలు అందుకున్న గిరిజనులు 10 రకాల ప్రయోజనాలు పొందుతారని చెప్పారు. కేసీఆర్ పాలన స్వర్ణయుగంలా ఉందన్నారు. బీఆర్‌ఎస్ సర్కార్ పనితనం పక్క రాష్ట్రాలలో ఉన్న రజినీకాంత్ లాంటి వారికి అర్ధం అవుతుందని కానీ.. కాంగ్రెస్, బీజేపీలో ఉన్న గజినీలకు అర్ధం కావడం లేదని విమర్శించారు.