Harish Rao: యోగా చేస్తే ఉత్సాహం, ఉల్లాసంగా ఉంటాం -హరీష్
22వ వార్డులో యోగా క్యాంపులో పాల్గొన్న మంత్రి హరీష్ వంద మందికి మ్యాట్‌లు పంపిణీ చేసిన మంత్రి హరీష్ రావు;
యోగా చేస్తే రోజంతా ఉత్సాహం, ఉల్లాసంగా ఉంటామన్నారు మంత్రి హరీష్ రావు. జీవితకాలం కూడా పెరుగుతుందన్నారు. ఆరోగ్య సిద్దిపేట సాధన.. యోగాతో సాధ్యమవుతుందన్నారు. సిద్దిపేటలోని 22వ వార్డులో సాగుతున్న యోగ క్యాంపులో పాల్గొన్న హరీష్ రావు.. వంద మందికి మ్యాట్‌లు పంపిణీ చేశారు. యోగా వల్ల కలిగే ఆరోగ్య సూత్రాలు వివరించారు.