మహబూబ్‌నగర్‌లో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరింది. మినీ ట్యాంక్‌బండ్ దగ్గర ఉన్న రామయ్యబౌలి, గణేష్‌నగర్‌లోని చెరువు కట్ట తూమును మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పరిశీలించారు. తాములు, నాళాల దగ్గర ఉన్న ఇళ్లల్లోకి నీరు చేరితే ...వెంటనే ప్రజలు అధికారులకు సమాచారం ఇవ్వాలని మంత్రి కోరారు. టోల్ ఫ్రీ నెంబర్ 241165కు ఫోన్ చేయాలన్నారు. పట్టణంలో కొత్తగా పెద్ద నాలాను 270 కోట్ల వ్యయంతో యుద్ధప్రాతిపదికన నిర్మిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు.