ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారయ్యింది. ఈనెల 8న ఉదయం 9గం.లకు హకీంపేట విమానాశ్రయం చేరుకోనున్న ప్రధాని అక్కడి నుంచి వరంగల్ బయల్దేరనున్నారు. ఉదయం 10.35 నిలకు ఆయన వరంగల్ చేరుకోనున్నారు. 10.45 నుంచి 11.20 వరకు వరంగల్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం 11.30కి బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం వరంగల్ నుంచి బయల్దేరి హకీంపేట విమానాశ్రయం చేరుకోనున్నారు. అక్కడి నుంచి ప్రధాని మోదీ రాజస్థాన్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు.