ఎన్టీఆర్ ట్రస్టు చైర్‌పర్సన్, టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఇవాళ కుప్పంలో పర్యటిస్తున్నారు. పాత మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఎన్టీఆర్ సంజీవని ఉచిత వైద్యశాల, ఎన్టీఆర్ ట్రస్టు ఉచిత వైద్య మొబైల్ వ్యాన్‌ను ప్రారంభించారు. అంతకుముందు ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయంలో అమ్మవారికి సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాంతిపురం మండలం కడపల్లె సమీపంలోని శివపురం వద్ద నిర్మాణంలో ఉన్న ఇంటిని పరిశీలిస్తారు. అక్కడ్నంచి బెంగళూరుకు చేరుకుని హైదరాబాదుకు తిరుగు ప్రయాణమవుతారు.