బస్సు, రైల్లో రద్దీ ఎక్కువైతే ప్రయాణికులు నిలబడి ప్రయాణించడం చూస్తుంటాం. కానీ విచిత్రంగా విమానంలో కూడా ఓ వ్యక్తి నిలబడి వెళ్లేందుకు సిద్దపడ్డాడు. ఈ ఘటన ముంబై నుంచి వారణాసి వెళ్లే ఫ్లైట్‌లో మంగళవారం జరిగింది. ముంబైలోని ఛత్రపతి శివాజీ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో ప్లైట్ టేకాఫ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నపుడు ఓ ప్రయాణికుడు నిలబడి ఉండటం చూసిన సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే అతడిని దింపేశారు.
ముంబై విమానాశ్రయంలో వింత ఘటన చోటుచేసుకొన్నది. ముంబై నుంచి వారణాసికి వెళ్లాల్సిన ఇండిగో విమానంలోని అన్ని సీట్లు నిండిపోయాయి. టేకాఫ్‌కు ఫ్లైట్ సిద్ధమైంది. ఇదే సమయంలో ఓవర్ బుక్ అయిన అఖిలేశ్ చౌబే అనే ప్రయాణికుడు విమానంలో నిలబడి ఉండటాన్ని గమనించిన సిబ్బంది.. పైలట్‌ను అలర్ట్ చేశారు. దీంతో పైలట్ విమానాన్ని తిరిగి వెనక్కు మళ్లించాడు. నిలబడ్డ ప్రయాణికుడిని దింపేసిన అనంతరం గంట ఆలస్యంతో విమానం బయలుదేరింది. బుకింగ్ విషయంలో చిన్న తప్పిదం జరిగిందని ఇండిగో సంస్థ తెలిపింది.