వైసీపీ చీఫ్ జగన్‌తో సెల్ఫీ దిగిన మహిళా కానిస్టేబుల్ అయేషా బానుకు ఉన్నతాధికారులు షాక్ ఇచ్చారు. విధి నిర్వహణలో ఉండి జగన్‌తో సెల్ఫీ దిగిన కానిస్టేబుల్‌కు ఛార్జిమెమో ఇస్తామని జైలర్ రవిబాబు తెలిపారు. ఆమె ఇచ్చిన వివరణ ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. వైఎస్ జగన్‌తో సెల్ఫీ దిగిన మహిళా కానిస్టేబుల్‌కు ఛార్జిమెమో ఇవ్వడంపై వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగిందని ఆరోపించింది.