సీఎం జగన్ ఎక్కడ సభ పెట్టి.. ప్రసంగించినా జనం పట్టించుకోవడం లేదు. ఎంతో ఉత్సాహంగా జగన్ స్పీచ్ మొదలు పెట్టగానే.. అదే ఉత్సాహంతో సభ నుంచి ప్రజలు వెళ్లిపోతున్నారు. అన్ని సభలోనూ ఇదే సీన్ జరుగుతోంది. ఇప్పుడు కల్యాణదుర్గంలోనూ ఇదే సీన్ రిపీయింది. జగన్ ప్రసంగిస్తుండగా సభ నుంచి ప్రజలు వెళ్లిపోయారు . మీటింగ్ నుంచి వెళ్లిపోతున్న ప్రజల్ని పోలీసులు అడ్డుకున్నారు. అయితే ఎవ్వరూ పోలీసుల మాటల వినలేదు. మరోవైపు పోలీసులకు ఉదయం నుంచి టిఫిన్ పెట్టకపోవడంతో నిర్వాహకులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.