Khammam: కేసీఆర్ పాలనను బంగాళాఖాతంలో కలిపేస్తారు: పొంగులేటి
భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి;
భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిసానన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఖమ్మం జిల్లాకు సంబంధించిన రాజకీయాలపై చర్చించామన్నారు. కేసీఆర్ పాలనను ప్రజలు బంగాళాఖాతంలో కలపడం ఖాయమంటూ ఎద్దేవా చేసారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. రాష్ట్రంలో ఇప్పుడు రెండే వర్గాలున్నాయని, ఒకటి ప్రభుత్వ అనుకూల వర్గం, రెండోది వ్యతిరేక వర్గం అన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను ప్రజలు ఓడించడం ఖాయమన్నారు. ఏపీలో సీఎంఓ అధికారులను మాత్రమే కలిసానని, సీఎం జగన్‌ను కలవలేదన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.