BABU ARREST: భువనేశ్వరి "ములాఖత్‌" తిరస్కరణ

అవకాశం ఉన్నా తిరస్కరించడంపై భువనేశ్వరి ఆవేదన;

Update: 2023-09-15 07:30 GMT

రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబును నేడు కలిసేందుకు ఆయన సతీమణి నారా భువనేశ్వరి దరఖాస్తు చేయగా అధికారులు తిరస్కరించారు. వారానికి మూడుసార్లు ములాఖత్ కు అవకాశం ఉన్నా తిరస్కరించారని భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. ములాఖత్ పైనా ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తోందన్నారు. నిబంధనల ప్రకారం ములాఖత్ కు అవకాశం ఉన్నా కాదనడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టు తర్వాత రాజమహేంద్రవరంలోనే నారా భుననేశ్వరి ఉంటున్నారు.

Tags:    

Similar News