PV Sindhu పీవీ సింధు ఈజీ విన్ - ప్రీ క్వార్టర్స్‌లోకి ఎంట్రీ
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు వరుసగా రెండో విజయం;
ఒలింపిక్స్‌లో మూడో పతకంపై తెలుగు తేజం, స్టార్ షట్లర్ పీవీ సింధు కన్నేసింది. గ్రూప్ స్టేజ్‌లో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. ఎస్తోనియా ప్లేయర్ క్రిస్టినా కుబాపై 21-5, 21-10 తేడాతో వరుస గేముల్లో గెలిచింది. దీంతో గ్రూప్-M నుంచి సింధు ప్రిక్వార్టర్స్‌కు (రౌండ్ -16) దూసుకెళ్లింది. తొలి గేమ్‌లో క్రిస్టినా ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. అయితే, రెండో గేమ్ ఆరంభంలో మాత్రం ఆమె నుంచి సింధుకు ప్రతిఘటన ఎదురైంది. ఎక్కడా ఏకాగ్రతను కోల్పోని సింధు పట్టు బిగించింది. ప్రత్యర్థికి మరో అవకాశం ఇవ్వకుండా గేమ్‌ను పూర్తి చేసింది. కేవలం 34 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ముగియడం విశేషం.
భారత షూటర్ స్వప్నిల్ కుశాలె 50 మీటర్ల 3 పొజిషన్ ఈవెంట్‌లో ఫైనల్‌కు చేరాడు. క్వాలిఫికేషన్ రౌండ్‌లో ఏడో స్థానంతో స్వప్పిల్ ముందంజ వేశాడు. గురువారం మధ్యాహ్నం 1గంటకు ఫైనల్ జరగనుంది.