ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు నిరాశ పరుస్తున్నాయి. తెలంగాణలో తక్కువ వర్షా పాతం నమోదు కావడంతో జలాశయాలు నీరు లేక వెలవెలబోతున్నాయి.నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పరిస్థితి మరీ దారుణంగా మారింది. గతేడాది ఇదే సమయంలో నిండు కుండలా ఉన్న ప్రాజెక్టు ఈ సారి వర్షాలు లేకపోవడంతో వెలవెలబోతుంది.